- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Chandrababu: ఐదేళ్లలో మన రోడ్లను చూసి పక్క రాష్ట్రాలు హేళన చేశాయి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రోడ్లను చూసి పక్క రాష్ట్రాలు హేళన చేశాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అనకాపల్లి జిల్లా (Anakapally District) వెన్నెలపాలెంలో రోడ్లపై గుంతలను పూడ్చే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతలు లేని రోడ్లే తమ ప్రభుత్వ అభిమతమని అన్నారు. వైసీపీ పాలనలో రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని ఆరోపించారు. మరికొన్ని చోట్ల ప్రమాదకరమైన గోతులు చేశారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో రోడ్లను చూసి పక్క రాష్ట్రాల వాళ్లు హేళన చేసే వరకు పరిస్థితి వచ్చిందని అన్నారు. రహదారుల కోసం గత ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు కూడా గత ప్రభుత్వం ఖర్చు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఏ ప్రాంతంలోనైనా రోడ్లు ఉంటనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రహదారులు బాగుంటేనే పరిశ్రమలు వచ్చి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఆంధ్రా ఎస్కోబార్ (Escobar) వచ్చి రోడ్లపై గుంతలు పెట్టి వెళ్లాడని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల వైసీపీ (YCP) పాలనలో రోడ్లపై నాట్లు వేయడం.. చేపలు పట్టిన పరిస్థితులు చేశామని అన్నారు. రాష్ట్రంలో కావాల్సింది సమగ్ర అభివృద్ధి అని.. సంక్రాంతి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండకుండా చేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వ పాలనలో స్వేచ్ఛగా నవ్వుకున్న పరిస్థితులు కూడా లేవని.. నేడు ప్రజలంతా సుఖ సంతోషాలతో బతుకుతున్నారని తెలిపారు. దేశం శరవేగంగా దూసుకెళ్తున్న సమయంలో రాష్ట్రంలో రోడ్లు ఇలా ఉండటానికి కారణం జగనే (Jagan) అని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు రూ.లక్ష కోట్ల మేర బకాయిలు పెట్టి వెళ్లారని.. రూ.10 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని తెలిపారు. చివరికి ప్రభుత్వ కార్యాలయాల (Government Offices)ను తాకట్టు పెట్టి అప్పులు చేశారని మండిపడ్డారు. విశాఖ (Vishakha)లో 52 ఎకరాల్లో రైల్వే జోన్ (Railway Zone)కు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. రూ.2,500 కోట్లతో అమరావతి రైల్వే లైన్ (Amaravati Railway Line) ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. విశాఖ (Vishakha) నుంచి అమరావతి (Amaravati)కి 2 గంటల్లో చేరుకునేలా బుల్లెట్ ట్రైన్ (Bullet Train)కు నాంది పలకబోతున్నామని తెలిపారు. రాష్టంలో మౌలిక సదుపాయాలు పెంచి అభివృద్ధిని పరిగెత్తిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.