Breaking: గుడివాడలో అన్న క్యాంటీన్‌ ప్రారంభం.. పేదలకు భోజనం వడ్డించిన చంద్రబాబు

by srinivas |   ( Updated:2024-08-15 15:59:37.0  )
Breaking: గుడివాడలో అన్న క్యాంటీన్‌ ప్రారంభం.. పేదలకు భోజనం వడ్డించిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: పేదల ఆకలితీర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. సతీమణి నారా భుశనేశ్వరితో కలిసి పేదలకు స్వయంగా చంద్రబాబు అన్నం వడ్డించారు. తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను రీఓపెన్ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు తొలి అన్న క్యాంటీన్‌ను గుడివాడలో పున:ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 103 అన్న క్యాంటీన్లు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తొలి విడతగా 17 జిల్లాల్లో క్యాంటీన్లను పున:ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 5 కల్లా 103 అన్న క్యాంటీన్ల ప్రారంభిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్యాంటీన్లలో రూ. 5 కే ఉదయం టిఫిన్, భోజనం, రాత్రి డిన్నర్ సైతం పంపిణీ చేయనున్నారు.

Advertisement

Next Story