- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu Naidu: ‘ఒకప్పుడు ఏపీ అంటే అవహేళన చేశారు..కానీ మళ్లీ నెంబర్ వన్ చేస్తా’
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, ఆర్థిక కార్యక్రమాలను పెంచడానికి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి మనందరం ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పిలుపునిచ్చారు. సీప్లేన్ ప్రయాణం ఓ వినూత్నమైన అవకాశమని, ప్రస్తుతం ఈ సీప్లేన్‌లను టూరిజానికి మాత్రమే వినియోగించబోతున్నామని కానీ రాష్ట్రానికి 972 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది కాబట్టి రాబోయే కాలంలో పూర్తిగా విమాన సర్వీసులు కూడా సీ రూట్‌లో నడిపే అవకాశం ఉంటుందని, వాటినే రవాణాకు కూడా వినియోగించుకోవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. ఏడాది కాలంలో ఓ 10 సీ ప్లేన్స్ అభివృద్ధి చేస్తే.. ఒకటి, రెండు ఆంధ్రాలోనే వాడుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు (Central Aviation Minister Rammohan Naidu)ను చంద్రబాబు కోరారు. విజయవాడ - శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని (AP Tourism) అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ సర్వీసులను ఏపీలో ప్రారంభించబోతుండగానే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంతకాలం ఏపీ అంటే అవహేళన చేశారని, కానీ తమ ప్రభుత్వం మళ్లీ ఏపీని నెంబర్ వన్ బ్రాండ్‌గా చేస్తుందని అన్నారు. అభివృద్ధి జరిగి సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, అలా ఆదాయం పెరిగితేనే పేదల కోసం సంక్షేమం చేయగలమని, అలా కాకుండా అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తే అది శాశ్వంగా చేయలేమని చెప్పారు.
‘‘ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ (Technology) ఏజ్‌లో మనం దాన్ని ఉపయోగించుకుని.. పేదరిక నిర్మూలనకు ఉపయోగించుకోవాలి. ప్రభుత్వానికి విధానాలు సక్రమంగా ఉంటే ప్రస్తుత పరిస్థితులనే కాకుండా భావితరాలను కూడా తీర్చిదిద్దుకోవచ్చు. 22 సంవత్సరాల క్రితం ఐటీని ప్రమోట్ చేస్తే.. అందరూ నవ్వారు. ‘మనకి ఐటీ అవసరమా..?’ అన్నారు. అలాంటిది ఈ రోజు ఐటీ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. ఈ రోజున అమెరికాలో ఐటీ రంగంలో అందరికంటే ఎక్కువగా ఇండియన్స్ సంపాదించుకుంటున్నారు. అందులోనూ తెలుగువాళ్లు టాప్‌లో ఉన్నారు. రాబోయే రోజుల్లో మన ఏపీలోనే ఆ స్థాయి ఆదాయం అందరికీ అందించాలని ఆశిస్తున్నాను. అప్పట్లో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చి హైదరాబాద్ (Hyderabad)లో ఆ పరిశ్రమను నెలకొల్పగా ఇప్పుడు ఆ నగరం ప్రపంచంలోనే టాప్ రేంజ్‌లో ఐటీ రంగంలో దూసుకుపోతోంది. అలాగే 25, 30 ఏళ్లలో ఎనర్జీ టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ రోజున మన ఇంటి మీదనే కరెంట్‌ను తయారుచేసుకుంటున్నాం. అందుకే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారాలి. కొత్త ఆవిష్కరణలు చేయాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రజా జీవనం మెరుగుపడుతుంది.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
అంతేకాకుండా.. ఒకప్పుడు ప్రభుత్వమే మొత్తం చేయాలనే విధానం ఉండేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం పాలసీ చేస్తే.. ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెట్టి ఆ పని చేసే పరిస్థితులు వచ్చాయని, దాన్నే పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (Public-Private Partnership) అంటున్నామని, రోడ్లు, విమానాలు, విమానాశ్రయాలు, పవర్ వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ విధానంలోనే వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సీప్లేన్ సర్వీసులు కూడా ఆంధ్రా టూరిజానికి ఎంతో ఉపయోగపడతాయని, భవిష్యత్తులో స్పెషల్ అట్రాక్షన్‌గా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.