- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu: భూములను ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరు.. సీఎం చంద్రబాబు హెచ్చరిక
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇక ఎవరైనా భూములను ఆక్రమిస్తే బయట తిరగలేరని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హెచ్చరించారు. అసెంబ్లీ (Assembly)లో ల్యాడ్ గ్రాబింగ్ యాక్ట్-2024 (Land Grabbing Act-2024) చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిని ఆక్రమిస్తే చట్ట ప్రకారం శిక్ష పడుతుందని.. భూమికి కూడా ఉండదని కామెంట్ చేశారు. భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేందుకు తమ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 (Lad Grabbing Act-2024) పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొస్తుందని తెలిపారు. ఇక నుంచి భూమిని ఆక్రమించిన వాళ్లకు ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తామని అన్నారు. భూ ఆక్రమణలపై డీఎస్పీ (DSP) లేదా ఆ పైస్థాయి అధికారి విచారిస్తారని అన్నారు. పీడీ యాక్ట్ (PD Act)కు కూడా పదును పెడుతున్నామని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం (YCP Government) హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) పేరుతో విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. రైతులకు నోటీసులు కూడా ఇవ్వకుండా నిర్ధాక్షిణ్యంగా రెవెన్యూ రికార్డుల (Revenue Records)ను మార్చేశారని ఆరోపించారు. ఐదైనా తేడా ఉందటే హైకోర్టుకు వెళ్లి తేల్చుకోవాలంటూ బాధితులకు ఉచిత సలహాల కూడా ఇచ్చారని గుర్తు చేశారు. హైకోర్టు (High Court)కు వెళ్లాలంటే సామాన్యులకు సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. అందుకే ఆ చట్టాలను కాల్చేసి అప్పట్లో నిరసన తెలియజేశామని అన్నారు. తాము అధికారంలో రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act)ను రద్దు చేశామని పేర్కొన్నారు. చట్టాన్ని రద్దు చేశాం కానీ.. జరిగిన అవకతవకలను ఏం చేయలేకపోతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
Read More : ఆడబిడ్డల జోలికి వస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్