- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎట్టకేలకు స్పందించిన సీఎం చంద్రబాబు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల పల్నాడు జిల్లాలో జరిగిన హత్య కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి అతికిరాతకంగా వైసీపీ కార్యకర్త రషిద్‌ను దారుణంగా హత్య చేశారు. అయితే ఈ ఘటనపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ హత్యపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..పల్నాడు జిల్లా వినుకొండ హత్య గంజాయి వల్లే జరిగిందని వైసీపీ నేతలే ఒప్పుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. హత్య చేసిన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తి ఇద్దరు వైసీపీ వారే అని సీఎం చంద్రబాబు తెలిపారు. వైఎస్ జగన్ పెంచి, పోషించిన గంజాయి, డ్రగ్స్ సంస్కృతి వల్లే ఈ అనర్ధాలు జరుగుతున్నాయి అని సీఎం మండిపడ్డారు. గత వైసీపీ పాలన వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి పోయాయని అన్నారు. అసెంబ్లీలో శ్వేతపత్రాల్లోని వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఢిల్లీ వెళ్తామని డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ ఎంపీలతో సమావేశంలో విమర్శించారు.
Read More..
AP News:ముగిసిన పార్లమెంటరీ సమావేశం..టీడీపీ ఎంపీలకు సీఎం కీలక సూచనలు!