సలేశ్వరం వెళ్లే భక్తులకు విజ్ఞప్తి.. అసలు విషయం ఏంటంటే..?

by Naveena |
సలేశ్వరం వెళ్లే భక్తులకు విజ్ఞప్తి.. అసలు విషయం ఏంటంటే..?
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల కొండల్లోని వెలసిన సలేశ్వరం లింగమయ్య జాతర ఉత్సవాలకు సిద్ధమవుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో.. లింగమయ్య స్వామి దర్శనం అనంతరం చాలాసేపు అక్కడే భక్తులు సేద తీరడం వలన క్రౌడ్ మరింత పెరిగి భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కావున భక్తులు అర్థం చేసుకొని అటవీశాఖ పోలీస్ సిబ్బందికి సహకరించాలని డిఎస్పీ పల్లె శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు తెలిపారు. అలాగే శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో.. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని,అటవీ మార్గంలో ఎటుపడితే అటు వెళ్లకుండా భక్తులు ఒకే మార్గంలో వెళ్లాలని సూచించారు.



Next Story