- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వేటగాళ్ల ఉచ్చుకు యువకుడు బలి
by Jakkula Mamatha |

X
దిశ ప్రతినిధి, చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగవరం మండలం కొత్తపల్లి గ్రామ పొలాల్లో వేటగాళ్ల ఉచ్చుకు ఓ యువకుడు బలయ్యాడు. వన్యప్రాణుల వేటకై అమర్చిన విద్యుత్ తీగ తగిలి కార్తీక్ (22) అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరో యువకుడు యువరాజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. అయితే.. గత రాత్రి తప్పిపోయిన పాడి ఆవు కోసం వెతుకుతూ వెళ్లిన కార్తీక్, యువరాజులు సుందరం అనే రైతు పొలం చుట్టూ వేసిన విద్యుత్ కంచెను తాకడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. దీంతో కార్తీక్ స్పాట్‌లోనే మృతి చెందగా యువరాజు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story