- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirupati: రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు
దిశ, తిరుపతి: ఏప్రిల్ నెల వచ్చింది మొదలు ఉష్ణోగ్రతలు పెరిగాయి. అసాధారణంగా పెరుగుతున్న ఎండలు ఏపీతో పాటు చిత్తూరు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో మందుబాబుల చూపు బీర్లపై పడింది. ఫలితంగా ఈ నెలలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ నెల 1 నుంచి 17 వరకు ఉమ్మడి జిల్లాలో ఏకంగా రూ. 32 లక్షల విలువైన బీర్లు అమ్ముడైనట్టు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతిలో అత్యధికంగా 16 బార్లు ఉన్నాయి. ఈ బార్లలో బీర్లు తాగుతూ మందుబాబులు పండగ చేసుకుంటున్నారు.
ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం
‘ఈ రెండు జిల్లాల్లో కలిపి ఈ నెల 17 వరకు మొత్తం రూ. 32 లక్షల బీర్లు అమ్మడుపోయాయి. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి తిరుపతి జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. తిరుపతి, చిత్తూరు జిల్ల కేంద్రాల్లో బీర్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. నెలకు సగటున లక్ష న్నారు బీరు కేసులు అదనంగా అమ్ముడవుతున్నాయి.’ అని గణాంకాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి: Hailstorms: ఏపీకి హెచ్చరిక.. 125 మండలాల్లో వడగాల్పులు