- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala శ్రీవారి దర్శనం కోసం నిమిషాల్లోనే - కొత్త రికార్డు..!!
దిశ, తిరుపతి: శ్రీవారి దర్శనం..సేవల టికెట్ల విక్రయాల్లో తిరుమలలో కొత్త రికార్డు నమోదైంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. వచ్చే రెండు నెలల కోసం దర్శనం, సేవా టికెట్లను టీటీడీ ఆన్ లైన్ ద్వారా కోటా విడుదల చేసింది. భక్తుల నుంచి టోకెన్లు పొందేందుకు అనూహ్య స్థాయిలో స్పందన కనిపించింది. అంచనాలకు మించి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆన్‌లైన్ విధానం టోకెన్లు పొందేందుకు భారీ డిమాండ్ ఏర్పడింది. రెండు నెలలకు సంబంధించిన అంగప్రదిక్షణ టికెట్లు కేవలం 9 నిమిషాల్లోనే పూర్యయ్యాయి. అదే విధంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఆరు లక్షల టోకెన్లు కేవలం 85 నిమిషాల్లోనే అమ్మకం పూర్తయింది.
మార్చి నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం, సేవా టికెట్లను ఆన్‌లైన్ ద్వారా భక్తులకు అందించారు. వచ్చే నెలలో స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటుగా ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈసారి గత రికార్డులను తిరగరాసేలా భక్తుల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. సీనియర్ సిటిజెన్స్, వికలాంగుల కోసం విడుదల కేసిన కోటా కూడా కేవలం 95 నిమిషాల్లోనూ పూర్తయింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందేందుకు భక్తులు టీటీడీ వెబ్ సైట్‌తో పాటుగా యాప్ ద్వారా పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దీంతో కేవలం 85 నిమిషాల్లోనే 6 లక్షల టోకెన్లు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఈ మధ్యాహ్నం మూడు నెలలకు సంబంధించిన 46 వేల శ్రీవాణి టికెట్లను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే శ్రీవాణి టికెట్లకు భారీ స్పందన కనిపిస్తోంది. టీటీడీకి అనూహ్యంగా టోకెన్ల ద్వారా రూ 10 కోట్ల మేర ఆదాయంతో కొత్త రికార్డు నమోదైంది.