- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు..
దిశ, తిరుమల:శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం సమయంలో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పై రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య, బస్సు యాత్ర కొనసాగకుండా భయపెట్టాలని హత్య ప్రయత్నం చేయాలని ఒక రకమైన కుట్రతో దాడి చేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఈ దాడి చేశారు. దీని బాధ్యతగా తీసుకోకుండా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రతిపక్షాలు చేస్తున్నాయన్నారు. జరిగిన దాడిని అపహాస్యం చేస్తూ జగన్ పై సభల్లో విమర్శలు చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
చంద్రబాబు ప్రసంగాలు చూస్తే ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ప్రతి రోజు రాష్ట్ర ఈసీకి చంద్రబాబు పై ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఓడిపోతామన్న కోపంతో ప్రతిపక్ష నాయకులు సీఎం జగన్ పై దాడి చేయించారు. దాడి వెనుక టీడీపీ హస్తం ఉంది.అలాగే ప్రతిపక్షాల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రానున్న ఎలక్షన్ లో 175/175 వైసీపీకి రావడం ఖాయం అన్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్, పురందేశ్వరి, సుజనాచౌదరి, సీఎం రమేష్ ఓడిపోవడం ఖాయం. అలాగే చంద్రబాబుకు డిపాజిట్ కూడా రాదు అని ఆయన తెలిపారు.