- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kannappa: శ్రీకాళహస్తి మహత్యంపై సాంగ్.. ఆడి, పాడింది మంచు విష్ణు కుమార్తెలే..!

దిశ, వెబ్ డెస్క్: మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన కన్నప్ప మూవీ టీమ్ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘నా సోదరుడు బొజ్జల సుధీర్‌కు కంగ్రాట్స్.. ఎమ్మెల్యేగా స్వయంగా శ్రమ, కృషితో ఎదిగారు. శ్రీకాళహస్తి టెంపుల్‌ను అత్యద్భుతంగా అలంకరించారు. ‘కన్నప్ప’ సినిమా(Kannappa Movie) షూటింగ్ పూర్తి అయింది. ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నాం. రెండు రోజుల్లో టీజర్ రిలీజ్ అవుతుంది. శ్రీకాళహస్తి మహత్యంపై ఓ పాట రికార్డ్ చేశాం. సుద్దాల అశోక్ తేజ, రామ్ జోగయ్య శాస్త్రి రచించారు. నా కూతుళ్లు అరియానా, వివియాలు ఆడి పాడారు. వాళ్లపై చిత్రీకరించాం. స్థల పురాణం ఆ పాట ద్వారా తెలుస్తుంది. మార్చి 19న ఆ పాట విడుదల అవుతుంది. ఒక నాస్తికుడు.. దేవుడి భక్తుడు అయిన తర్వాత ఎలా ఉంటది అనేది ‘శివ, శివ శంకర’ పాటలో తెలుస్తుంది. ఆ పాట నన్ను వ్యక్తిగా, మనిషిగా మార్చింది.’’ అని చెప్పారు.