- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్
దిశ,తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శ్రీలంక గవర్నర్ సెంథిల్ తొండమాన్ లు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్ద బండారు దత్తాత్రేయకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయక మండపంలోశ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శ్రీలంక గవర్నర్ సెంథిల్ తొండమాన్ లు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపల బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక భావాలు గ్రామాలకు వెలిసిల్లే విధంగా టీటీడీ కార్యాచరణ రూపొందించుకోవాలని, అలాగే ధార్మిక ప్రచారం, సనాతన ధర్మ పరిరక్షించుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలు స్థాపించాలని కోరుతున్నాను. ముఖ్యంగా నేను కోరుకునేది ఒక్కటే ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా బలపడాల్సి ఉంది. కాబట్టి ప్రతి ఓటరు ఎలక్షన్ లో ఓటు వినియోగించుకొని, దేశ సమైక్యతకు మరియు రెండు రాష్ట్రాల అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.