- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ganjai: విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి అమ్మకాలు
దిశ, తిరుపతి: చంద్రగిరిలో జోరుగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం ప్రభుత్వ బాలుర పాఠశాలలో గంజాయి కలకలం రేపింది. పాఠశాల వెనుక కొందరు విద్యార్థులు గంజాయి పీలుస్తూ కంటపడ్డారు. ఆ వెంటనే విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే పాఠశాల ఆవరణలోనే మత్తు పదార్థాలు సేవిస్తూ ఉన్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తోంది. మత్తు పదార్థాలు సేవించడంపై పాఠశాల యాజమాన్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు.
గంజాయి అమ్మకాలపై సీఐ సీరియస్
అటు చంద్రగిరి సీఐ ఓబులేసు గంజాయి అమ్మకాలపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వ బాలుర పాఠశాల సిబ్బందితో ఫోన్ చేసి విచారించారు. గంజాయి ఎక్కడ నుంచి రవాణా జరుగుతుందోనని ఆరా తీశారు. విద్యార్థులకు వరుసగా కౌన్సెలింగ్ ఇవ్వాలని సీఐ నిర్ణయించారు. పాఠశాలల వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గంజాయి మూలాలపై దృష్టి పెట్టి తీవ్ర చర్యలు తీసుకుంటామని ఓబులేసు చెప్పారు.