- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: తిరుమలలో చిరుత కలకలం.. ఐదేళ్ల బాలుడిపై దాడి
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో చిరుత కలకం రేగింది. ఐదేళ్ల బాలుడిపై దాడి చేసింది. అంతేకాదు బాలుడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు గట్టిగా కేకలు వేయడంతో బాలుడిని అక్కడే వదిలేసి పారిపోయింది. నడకదారి మార్గం 7వ మైలు వద్ద ఈ ఘటన జరిగింది. చిరుత దాడిలో బాలుడికి గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడిపై చిరుత దాడి బాధాకరమన్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
మరోవైపు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలతో తిరుమల శ్రీవారిని దర్శంచుకునేందుకు వచ్చామని.. చిరుత ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. అధికారులు త్వరగా చిరుతను గుర్తించి బంధించాలని అంటున్నారు. మరోవైపు భక్తులను అధికారులు అలర్ట్ చేస్తున్నారు. చిన్న పిల్లలను భద్రంగా చూసుకోవాలని చెబుతున్నారు. తిరుమల కొండపైకి ఒక్కరిగా వెళ్లకుండా అందరూ కలిసే వెళ్లాలని అధికారులు సూచించారు.