Tirupati: టీటీడీకి చెన్నై భక్తుడు భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం అందజేత

by srinivas |   ( Updated:2024-11-23 14:00:14.0  )
Tirupati: టీటీడీకి చెన్నై భక్తుడు భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల వెంకన్న పుణ్యక్షేత్రానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు భారీగా డబ్బులు అందజేస్తున్నారు. శ్రీవారి ఆదాయం సైతం వేలు, లక్షలు దాటి కోట్లలోకి చేరింది. అటు విరాళాలు, ఇటు ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానం డిపాజిట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు, వ్యాపారుల, సాధారణ జనం సైతం తిరుమల శ్రీవారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తున్నారు. దీంతో తిరుమల వెంకన్న అత్యంత సంపన్నుడిగా మారిపోతున్నారు. ఇలా వచ్చిన డబ్బులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు భక్తులకు వివిధ రకాల సేవలందిస్తున్నారు.

తాజాగా చెన్నైకు చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ రూ. 2 కోట్లకు పైగా విరాళం అందజేశారు. టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్టుకు రూ. 1.01కోట్ల డీడీని వ్యాసరాజ మఠాధిపతి విద్యాశ్రీశ తీర్థ స్వామీజీ సమక్షంలో అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరికి వర్ధమాన్ జైన్ అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed