Delhi: సీఎం జగన్ బిజీబిజీ

by srinivas |   ( Updated:2023-05-28 12:18:00.0  )
Delhi: సీఎం జగన్ బిజీబిజీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో భేటీ అయ్యారు. అయితే ఈ రాత్రి 9 గంటలకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు, విభజన హామీల అమలు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇకపోతే నీతీ ఆయోగ్ సమావేశం, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైతం సీఎం జగన్ పాల్గొన్నారు.

Also Read..

Gudivada: చంద్రబాబు, లోకేశ్‌కు కొడాలి నాని సవాల్

Next Story

Most Viewed