భీమవరంకు సీఎం జగన్.. పాతపాటి సర్రాజు కు నివాళులు

by Mahesh |
భీమవరంకు సీఎం జగన్.. పాతపాటి సర్రాజు కు నివాళులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు మృతి చెందిన నేపథ్యంలో ఆయన మృతదేహానికి నివాళులర్పించనున్నారు. శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 2.15 గంటలకు భీమవరం నియోజకవర్గం పెద అమిరం చేరుకుంటారు. అక్కడ క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ దివంగత పాతపాటి సర్రాజు నివాసంలో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 3.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

Next Story