- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొండెం ఉంది.. తల తీసేశారు.. మాజీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్లలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ మూడు ముక్కల ఆట ఆడారని విమర్శించారు. సీఎం జగన్ తీరుతో ఏపీకి మొండెం ఉంది కానీ తల (రాజధాని) లేకుండా పోయిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుండి పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నారని.. ప్రజలకు రూ.10 ఇచ్చి.. రూ.100 తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని నిప్పులు చెరిగారు.
వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఒక్కొ మీటింగ్‌కు జగన్ రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో కొందరు మంచివాళ్లు.. మరికొందరు రౌడీలున్నారని.. ఆ రౌడీలు మనకు వద్దని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలకు కూడా సీఎం జగన్ అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి నెలకొందని.. టీడీపీ హయాంలో మాత్రం ప్రజలు నేరుగా మా ఇంటికే వచ్చేవారని గుర్తు చేశారు. జగన్ బహిరంగ సభలకు వెళ్లకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వం మరీ ఉన్మాదంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత వ్యక్తిని హత్యచేసిన వ్యక్తిని పక్కనపెట్టుకుని జగన్ ఊరేగుతున్నారని ధ్వజమెత్తారు.