సహాయక చర్యల జాప్యంపై చంద్రబాబు ఆగ్రహం

by M.Rajitha |
సహాయక చర్యల జాప్యంపై చంద్రబాబు ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ వరద ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అమరావతిలో వరద తీవ్రత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాగా బాదితులకు సహాయక చర్యలు సరిగ్గా అందటం లేదని గుర్తించిన సీఎం అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. చాలామంది వరద ప్రాంతాల్లో చిక్కుకున్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎందుకు జాప్యం చేశారని ప్రశ్నించారు. బాదితులకు సరిపడా ఆహారాన్ని తెప్పించినప్పటికీ.. ఎందుకు అందజేయలేదని సీరియస్ అయ్యారు. ఆహారం పంపిణీ ఆలస్యం చేసిన అధికారులపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజలకు సేవ చేయడానికే అని, పని చేయడం ఇష్టం లేకుంటే మానేయాలని చంద్రబాబు అధికారులపై మండిపడ్డారు. స్వయంగా తానే క్షేత్రస్థాయిలో పని చేస్తుంటే మీరు మొద్దు నిద్ర వదలక పోతే ఎలా అంటూ క్లాస్ పీకారు. ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా నడుచుకోవాలని హితవు పలికారు. కాగా పొరుగు జిల్లాల నుండి మరో 3 లక్షల ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ తెప్పించాలని సూచించారు. వీలతే వరద బాదితులకు పండ్లు కూడా అందజేయాలని సీఎం పేర్కొన్నారు.

Next Story

Most Viewed