BREAKING: నాలుగో సారి AP సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు

by Satheesh |   ( Updated:2024-06-13 11:28:13.0  )
BREAKING: నాలుగో సారి AP సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాలుగో సారి బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సీఎంగా ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సెక్రటేరియట్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 4.41 నిమిషాలకు బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు సెక్రటేరియట్ సిబ్బంది పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బాబు ఐదు ఫైళ్లపై సంతకం చేశారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం, పింఛన్‌ రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, అన్నక్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం స్కిల్‌ సెన్సస్‌పై ఐదో సంతకం చేశారు. అంతకు ముందు సెక్రటేరియట్‌కు బయలుదేరిన చంద్రబాబుకు రోడ్డు పొడవునా జనం నీరాజనాలు పలికారు.

Advertisement

Next Story

Most Viewed