- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుప్పం రావడానికి CM జగన్‌కు సిగ్గుండాలి: చంద్రబాబు ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: అధికార వైసీపీ, సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. సోమవారం కుప్పంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన బాబు మాట్లాడుతూ.. నా సొంత ఇలాకా కుప్పంలో నన్ను ఓడిస్తామని.. వైనాట్ 175 అని వైసీపీ నేతలు అంటున్నారు.. నేను వైనాట్ పులివెందుల అంటున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కుప్పంలో చిల్లర రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలుపు కాదు కదా.. కనీసం వైసీపీకి డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. తన సొంత నియోజకవర్గ కుప్పంలో తనపైనే రౌడీయిజం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కుప్పం రావడానికి సీఎం జగన్‌కు సిగ్గుండాలని బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రామాలు, సినిమా సెట్టింగ్‌లతో కుప్పం ప్రజల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొస్తామని ఈ సందర్భంగా బాబు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. కాగా, సీఎం జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతోన్న విషయం తెలిసిందే.
Read More..