Viveka Case: కీలక పరిణామం.. సీబీఐ కార్యాలయానికి వివేకా హత్య నాటి ఎస్పీ రాహుల్ దేవ్

by srinivas |   ( Updated:2023-04-24 14:47:46.0  )
Viveka Case: కీలక పరిణామం.. సీబీఐ కార్యాలయానికి వివేకా హత్య నాటి ఎస్పీ రాహుల్ దేవ్
X

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. కడప జిల్లా పులివెందులలో వివేకా ఇంటికి ఆదివారం వెళ్లిన సీబీఐ టీమ్ .. ఆయన హత్య జరిగిన ప్లేస్‌ను పరిబీలించారు. వివేకా బెడ్ రూమ్‌తో పాటు బాత్రూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అటు వైఎస్ అవినాశ్ రెడ్డి ఇంటిని సైతం పరిశీలించారు. పనిలో పని వివేకా హత్య సమయంలో కేసు దర్యాప్తు చేసిన ఎస్పీ రాహుల్ దేవ్‌ను హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి రావాలని కోరారు. దీంతో రాహుల్ దేవ్ సోమవారం హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. వివేకా కేసు వివరాలను ఆయన సీబీఐ అధికారులకు అందించారు. దాదాపు గంట పాటు సీబీఐ కార్యాలయంలోనే రాహుల్ దేవ్ ఉన్నారు. పలు వివరాలు కూడా సీబీఐ అధికారులు అడిగి తెలుసుకున్నారు.

అయితే వివేకా హత్య జరినప్పుడు రాహుల్ దేవ్ కడప ఎస్పీగా పని చేశారు. అటు ఏపీ ప్రభుత్వం వేసిన సిట్‌లోనూ ఆయన పని చేశారు. వివేకా హత్య జరిగిన స్థలంలో ఆధారాలను ఎస్పీ రాహుల్ దేవ్‌కు కుటుంబసభ్యులు ఇచ్చారు. ఈ వివరాలన్నీ కూడా సీబీఐ అధికారులకు రాహుల్ దేవ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి :

వైఎస్ వివేకా మర్డర్.. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఛానల్ పెట్టిన ఆర్జీవీ.. ఆ ట్వీట్ వైరల్

మళ్లీ తెరపైకి ‘‘రాయల తెలంగాణ’’.. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన డిమాండ్

Advertisement

Next Story