- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MP YS అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. సీబీఐ అధికారులు పులివెందులలోని ఎంపీ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 6వ తేదీన తప్పనిసరి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, అధికారులు వచ్చినప్పుడు ఎంపీ అవినాష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి నోటీసులు అందజేసి వెళ్లారు. ఇప్పటికే అవినాష్‌ను రెండుసార్లు విచారించిన సీబీఐ.. ఇప్పుడు మరోసారి విచారించేందుకు సిద్ధమైంది.
Next Story