Obulapuram Mines Case: 33 మందికి సమన్లు... వేగం పెంచిన సీబీఐ కోర్టు

by srinivas |   ( Updated:2023-07-01 13:39:45.0  )
Obulapuram Mines Case:  33 మందికి సమన్లు... వేగం పెంచిన సీబీఐ కోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: ఓబుళాపురం గనుల కేసు విచారణను సీబీఐ కోర్టు వేగవంతం చేసింది. కేసులో సాక్షులుగా ఉన్న 33 మందిని ఈ నెలలోనే విచారించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు 33 మందికి సమన్లు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసును ప్రతి రోజు విచారిస్తోంది. మొత్తం 180 మంది సాక్షుల్లో ఇప్పటివరకూ 88 మంది విచారణను పూర్తి చేసింది. ఈ కేసులో ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్, అలీఖాన్, సబితా ఇంద్రారెడ్డి, కృపానందం, రాజగోపాల్ నిందితులుగా ఉన్నారు.

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత, సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నసమయంలో అనంతపురం జిల్లా ఓబుళాపురంలోని గనులను గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి గనుల లీజులు కేటాయింపులు జరిగాయి. అయితే గనుల లీజుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసు విచారణను సీబీఐ కోర్టు ముమ్మరం చేసింది.

Advertisement

Next Story

Most Viewed