Cancellation of transfers: ఉపాధ్యాయుల బదిలీలు రద్దు.. 917 మంది రిలీవింగ్ ఆదేశాలు నిలిపివేత

by Shiva |
Cancellation of transfers: ఉపాధ్యాయుల బదిలీలు రద్దు.. 917 మంది రిలీవింగ్ ఆదేశాలు నిలిపివేత
X

దిశ, ఏపీ బ్యూరో: ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు పొందిన 917 మంది ట్రాన్స్‌ఫర్లను రద్దు చేసింది. ఎన్నికలకు ముందు పలు దఫాలుగా గత వైసీపీ ప్రభుత్వం భారీగా అక్రమ బదిలీలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అందులో 653 మందికి అప్పటి సీఎం ఆమోదముద్ర వేశారు. మరో 917 మందికి ఆర్డర్లు ఇచ్చినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇంకా ఓకే చేయలేదు. దీంతో వారంతా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆ ఆదేశాలను నిలుపుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బదిలీ చేసినా రిలీవ్ చేయట్లేదంటూ 215 మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే పాఠశాల విద్యాశాఖ అప్పటి బదిలీలకు సంబంధించిన రాటిఫికేషన్ ఫైలును సీఎంకు పంపింది. దానిని పరిశీలించిన సీఎం చంద్రబాబు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 917 మంది బదిలీ ఉత్తర్వులు రద్ద అయిపోయాయి.

Advertisement

Next Story