Brother Anil: విజయమ్మ కూడా బాధితురాలే.. జగన్‌పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-10-29 12:13:08.0  )
Brother Anil: విజయమ్మ కూడా బాధితురాలే.. జగన్‌పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ ఫ్యామిలీ(YS family)లో ఆస్తుల వివాదం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)సంపాదించిన ఆస్తుల్లో ఆయన తనయుడు జగన్ (Jagan), తనయ షర్మిల(Sharmila) మధ్య రాజుకున్న ఆస్తుల వివాదం హాట్ టాఫిక్‌గా మారింది. తల్లి, చెల్లిపై వైఎస్ జగన్ కోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇస్యూ సంచలనం రేపింది. దీంతో వైఎస్ జగన్, షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

మనవళ్లకు కూడా వాటా ఇవ్వాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పేవారిని, కాని జగన్ ఒక్కరే ఆస్తులు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని షర్మిల విమర్శలు చేశారు. ఇందుకు కౌంటర్ జగన్ కూడా విమర్శనాస్త్రాలు విసిరారు. ప్రతిపక్షాలతో చేతులు కలిపి, రాజకీయంగా తనను ఇబ్బందులకు గురి చేయాలని షర్మిల ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వివాదంపై వైసీపీ నేతలు, కాంగ్రెస్ నాయుల మధ్య సైతం మాటలయుద్ధం నడుస్తోంది.

ఈ క్రమంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్(Brother Anil)స్పందించారు. జగన్‌తో తమకు ఆస్తి గొడవలు లేవని తెలిపారు. వివాదాలుంటే ఏపీ(Ap)లోనే షర్మిల పార్టీ పెట్టేదని చెప్పారు. షర్మిలకు అన్న అంటే పిచ్చి అని, జగన్ కోసమే ఆమె పాదయాత్ర చేసిందని గుర్తు చేశారు. ఆస్తుల వివాదంలో వైఎస్ విజయమ్మ(YS Vijayamma) కూడా బాధితురాలేననని బ్రదర్ అనిల్ పేర్కొన్నారు.

Advertisement

Next Story