BREAKING: జగన్‌ దాడిపై స్పందించిన విజయవాడ సీపీ కాంతి రాణా.. కేసులో పలు కీలక విషయాలు వెల్లడి

by Shiva |
BREAKING: జగన్‌ దాడిపై స్పందించిన విజయవాడ సీపీ కాంతి రాణా.. కేసులో పలు కీలక విషయాలు వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ పేరుతో శనివారం సీఎం జగన్ బస్సుయాత్ర నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆయనపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రసంగిస్తున్న సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది. ఈ క్రమంలోనే దాడిపై విజయవాడ సీపీ కాంతి రాణా స్పందించారు. జగన్ భద్రతా దృష్ట్యా విద్యుత్ సరఫరాను ఆ ప్రాంతంలో నిలిపివేశామని తెలిపారు. సీఎం జగన్ బస్సు పైకి ఎక్కి మాట్లాడుతారనే వైర్లు కట్ చేశామని స్పష్టం చేశారు. నాయకుల ప్రచార సభల్లో ఇవన్నీ సర్వసాధారణమని ఆయన అన్నారు. ఘటన జరిగిన అజిత్‌సింగ్ నగర్ పీఎస్ పరిధిలో మూడు సెల్‌ఫోన్ టవర్ల నుంచి డేటాను స్వాధీనం చేసుకున్నారు.

ఘటన జరిగిన సమయంలో 20 వేల సెల్‌ఫోన్లు యాక్టివ్‌గా ఉన్నట్లు తాము గుర్తించామని అన్నారు. ఓ వైపు జనాల రద్దీ, మరోవైపు చికటిని అవకాశంగా తీసుకుని సీఎంపై దాడికి పాల్పడ్డారని సీపీ వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 8 బృందాలను నియమించామని పేర్కొన్నారు. త్వరలోనే దాడి చేసిన వారిని పట్టుకుంటామని అన్నారు. అక్కడున్న సీసీ ఫుటేజీని బట్టి ఓ వ్యక్తి దాడి చేయడాన్ని గుర్తించామని పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి 8.04 నిమిషాలకు సీఎంపై ఆగంతకుడు రాయి విసిరాడని తెలిపారు. ఆ రాయి సీఎం నిలబడిన ఎడమ వైపు నుంచి దూసుకొచ్చిందని అన్నారు. అది జగన్ కనుబొమ్మకి, వెల్లంపల్లి ముక్కు, కంటికి తగిలిందని తెలిపారు. అందుకు సంబంధించి వీడియో ఫుటేజ్ అందుబాటలో ఉందని, ఆ ఫుటేజీని విశ్లేషించేందుకు FSLకి పంపిచామని సీపీ క్రాంతి రాణా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed