టీటీడీ ఛైర్మన్‌ భూమనపై పురంధేశ్వరి సంచలన ఆరోపణలు

by srinivas |   ( Updated:2023-12-28 11:42:16.0  )
టీటీడీ ఛైర్మన్‌ భూమనపై పురంధేశ్వరి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో తిరుమలలో ఏర్పాట్లు సరిగా లేవనే ప్రచారం జరుగుతోంది. శ్రీవారి అన్న ప్రసాదంలోనూ నాణ్యత లోపించినట్లు ఈ మధ్య కాలంలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా భూమనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడని ఆమె వ్యాఖ్యానించారు. అమలాపురంలో బీజేపీ కార్యాలయాన్ని పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ నిధులను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్లక్ష్యంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. సీఎం జగన్‌ది స్టిక్కర్ల ప్రభుత్వమని విమర్శించారు. ఏపీకి కేంద్రం విడుదల చేస్తున్న నిధులనూ పక్కకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందించడం లేదని భూమన కరుణా కర్ రెడ్డిపై పురంధేశ్వరి మండిపడ్డారు.

Advertisement

Next Story