నేను నోరువిప్పితే జగన్ జైలుకే.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by srinivas |
నేను నోరువిప్పితే జగన్  జైలుకే..  బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ మాజీ మంత్రులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తీరుమారలేదని ఆయన ఎద్దేవా చేశారు. తాను నోరు విప్పితే జగన్‌తో పాటు ఆ పార్టీ మాజీ మంత్రులంతా జైలుకు వెళ్తారని హెచ్చరించారు. కూటమి హయాంలో 36 మంది హత్యకు గురయ్యారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి పేర్లు ఇవ్వాలని జగన్‌కు సవాల్ విసిరారు. గత ఐదేళ్ల విధ్వంసం పాలనతో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్లంతా ఆర్థిక శాఖ శ్వేతపత్రం చదవాలని విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed