మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన.. బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం

by srinivas |   ( Updated:2025-03-09 16:26:34.0  )
మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన.. బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: స్వచ్ఛ ఏపీ(Swach Ap)లో భాగంగా ప్రభుత్వం పలుచోట్ల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి(Generation of electricity from garbage) చేసే ప్రాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) బిక్కవోలు మండలం కాపవరం(Kapavaram) శివారులోనూ ప్లాంట్ నిర్మాణం కోసం కసరత్తులు జరుగుతున్నాయి. అయితే కాపవరం జిల్లా షరిషత్‌కు సంబంధించి 12 ఎకరాలు, జలభద్రపురం ఏపీ ఇండస్ట్రీయల్‌కు సంబంధించి 34 ఎకరాల భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ భూములను శనివారం మంత్రి నారాయణ(Minister Narayana) పరిశీలించారు. ప్లాంట్ ఏర్పాటుకు అనువైన పరిస్థితులను స్థానిక ఎమ్మార్వో సత్యకృష్ణ, రాజమండ్రి మున్సిపల్ ఈఈ-2 మాధవిని అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే ప్లాంట్‌ను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(BJP MLA Nallimilli Ramakrishna Reddy) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంత్రి నారాయణ పర్యటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా ప్రతిపాదనలు పంపారని, బలభద్రపురం-కాపవరం గ్రామాల్లో వద్దని అంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని సూచిస్తున్నారు. మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన దురదృష్టకరమన్నారు. అవసరమైతే ప్రజల తరపున పోరాటం చేస్తామని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

READ MORE ...

Vijayanagaram:‘సంక్షేమ పథకాలు అటకెక్కాయి’.. జిల్లా వైసీపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed