- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత

దిశ, వెబ్‌డెస్క్: బహుభాష విధానంపై జనసేన పార్టీ(Janasena Party) ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై తమిళనాడులోని అధికార డీఎంకే నేతలతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం, అని పవన్ కళ్యాణ్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ పెట్టారు. దీనికి బీజేపీ(BJP) నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) స్పందించారు. ప్రకాష్ రాజ్(Prakash Raj)కు కౌంటర్‌గా ట్వీట్ పెట్టారు.
‘పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే నీకు ప్రచారం వస్తుంది. అందుకే మీకు నా నాదొక ప్రశ్న.. మీరు బతకడం కోసం కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం నేర్చుకున్నారు? హిందీ సినిమాల ద్వారా డబ్బు సంపాదించటం వరకు ఓకే, కానీ అదే భాషపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం అంటే తల్లి పాలు తాగి, తల్లిని ద్రోహం చేయడమే. మీరు భాషను ప్రేమించడం తప్పు కాదు.. రాజకీయ ఓటు బ్యాంక్ కోసం వాడుకోవడం సిగ్గు చేటు’ అని ప్రకాష్ రాజ్‌కు విష్ణువర్ధన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Also Read..
హిందీ దుమారం.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తమిళనాడు రియాక్షన్ ఇదే..!
DMK: త్రిభాషా విధానంపై పవన్ వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డీఎంకే