- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు అరెస్ట్‌పై వెలుగులోకి సంచలన విషయం..!
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఏపీ అభ్యర్థుల లిస్టు విడుదలయిన విషయం తెలిసిందే. అయితే అనకాపల్లి అభ్యర్థిగా మాజీ ఎంపీ సీఎం రమేశ్ ఖరారు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు అని సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్యాకేజీ డబ్బులు తీసేసుకున్నారని చెప్పారు. ఈ సొమ్ముతో జగన్ చాలా స్కాములు చేశారని ఆరోపించారు. ప్రశ్నిస్తున్నందుకే తమపై బుదరజల్లుతున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను బీజేపీ హైకమాండే ఖండించాలని తమకు చెప్పిందని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక రాష్ట్రానికి మంచిదని సీఎం రమేశ్ పేర్కొన్నారు.
ప్రభుత్వం అంటే ప్రత్యేకంగా జగన్ పేరు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తొలి నుంచి కూడా విశాఖ నుంచి పోటీ చేయాలని అనుకున్నానని, కానీ బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకే తాను అనకాపల్లిలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓ రెండు పార్లమెంట్ సీట్లు రావొచ్చని తెలిపారు. సీఎం జగన్ అండ్ కో ఏదైనా మాట్లాడగలని ఎద్దేవా చేశారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందారెడ్డిని చంపి నానా రకాలుగా మాట్లారని సీఎం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లిలిపైనా దుష్ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లందరూ కోవర్టులేనా అని సీఎం రమేశ్ ప్రశ్నించారు.
Read More..