Amaravathi ని రాజధానిగా కొనసాగిస్తాం.. BJP రాష్ట్ర అధ్యక్షుడు Somu Veerraju

by Javid Pasha |   ( Updated:2023-01-22 12:33:00.0  )
Amaravathi ని రాజధానిగా కొనసాగిస్తాం.. BJP రాష్ట్ర అధ్యక్షుడు Somu Veerraju
X

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని బీజేపీ దృఢ సంకల్పమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఈ విషయం లో ఎవరికి సందేహం అవసరం లేదన్నారు. విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి నగరానికి రోడ్డు, రైల్వే కనెక్టివిటే పెంచుతోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి కి రోడ్, రైల్వే కనెక్టివిటీ పెంచు తోందన్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఏపీకి పీఎం మోడీ చేసిన అభివృద్ధి గురించి చర్చించేందుకు దమ్ముంటే ఎవరైనా తనతో చర్చకు రావాలని సవాలు చేశారు. దేశంలో ఎక్కడా రాజధాని నిర్మాణ సమస్యలు రాలేదన్నారు ఏపీలో ఎందుకు వస్తున్నాయో ప్రజలు కూడా ఆలోచించాలి అన్నారు. దేశంలో ఎక్కడా రాజధాని నిర్మాణం చేసిన కేంద్రం ఆర్థిక సహకారం అందించింది అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి వేలకోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తుంటే ఎవరూ కేంద్రం చేస్తున్న అభివృద్ధి ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. రాజధాని కట్టలేని వారిని.. మూడు రాజధానులు అనే వారిని ఎందుకు ప్రశ్నలు వేయలేక పోతున్నారు అంటూ అడిగారు.

భీమవరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో రాజకీయ తీర్మానం చేస్తామని, రాష్ట్రంలో అవినీతి రాజకీయాలు పై చరమాంకం పడాలని పిలుపునిచ్చారు. పౌరసరఫరాల శాఖ లో ప్రతి సంవత్సరం అయిదువేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని సోము వీర్రాజు ఫైర్ అయ్యారురెండు దశాబ్దాల కు పైగా అవినీతి జరుగుతోంది అని ఆరోపించారుఈ అవినీతి ని ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కుటుంబ రాజకీయాలు కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే సోషల్ మీడియాలో చంపేస్తామంటూ మెసేజ్ లు పెడతారణి ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీలేని పోరాటం సాగిస్తున్నామని, నేచర్ క్యూర్ ఆసుపత్రి కి స్థలం ఇచ్చి వెనక్కి తీసుకున్న పాలకులు ను ప్రజలు ప్రశ్నించాలన్నారు. వైద్య పరంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సాధిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు అని సోమరాజు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : ఆ ఐదు నియోజకవర్గాల్లో ఫ్యాన్ స్లో

Advertisement

Next Story