Breaking:వైసీపీకి బిగ్ షాక్..?

by Jakkula Mamatha |   ( Updated:2024-08-17 08:56:24.0  )
Breaking:వైసీపీకి బిగ్ షాక్..?
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రస్తుతం వైసీపీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయనే చెప్పవచ్చు. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలక నేత ఆళ్ల నాని సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో పదవులకు రాజీనామా చేశానని, ప్రస్తుతం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. నేడు (శనివారం) ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేశానని తెలిపారు. పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా వెనుక పూర్తిగా వ్యక్తిగత కారణాలే ఉన్నాయని వివరించారు. ఏలూరులో వైసీపీ కార్యాలయానికి సంబంధించి లీజు గడువు ముగిసిందని ఆళ్ల నాని చెప్పారు. దీంతో అక్కడ పార్టీ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చేశామని తెలిపారు. స్థలం యజమాని అనుమతితో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిపామని, ఆ తర్వాత షెడ్లను తొలగించి స్థలాన్ని అప్పగించామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed