Breaking: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 31 మంది నిందితులకు బిగ్ షాక్

by srinivas |   ( Updated:2025-02-13 12:33:27.0  )
Breaking: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 31 మంది నిందితులకు బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు(Gannavaram TDP office attack case) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former MLA Vallabhaneni Vamsi)ని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌(Vijayawada Krishna Lanka Police Station)లో విచారిస్తున్నారు. ఇది జరుగుతుండగానే ఇదే కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 31 మంది నిందితులు విజయవాడ కోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితులకు బిగ్ షాక్ ఇచ్చింది. నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

మరోవైపు 4 గంటలుగా కృష్ణలంక పోలీస్స్టేషన్లో వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వంశీ స్టేట్ మెంట్‌ను సైతం రికార్డు చేశారు. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీని హాజరుపర్చనున్నారు. అయితే కేసులో వంశీ ఫోన్ కీలకంగా మారింది. ఫోన్ కోసం గన్నవరంలోని వంశీ ఇంట్లో పోలీసుల సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement
Next Story

Most Viewed