Big Shock: వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్.. పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!

by Shiva |
Big Shock: వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్.. పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీని కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఈ క్రమంలోనే వైసీపీ (YSRCP) ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. మరో నాలుగున్నరేళ్ల పాటు ఇలాగే పార్టీలో ఉంటే తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని భావిస్తున్న కొందరు పార్టీలు మారేందుకు సిద్ధం అవుతున్నారు. గ్రామాల్లో బూత్ లెవల్ కార్యకర్తల నుంచి జిల్లా నాయకులు అంతా వరుసగా కండువాలు మారుస్తున్నారు.

ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు (Former Ministers), ఎంపీ (MP's)లు, ఎమ్మెల్యే (MLA's)లు సైతం టీడీపీ (TDP), జనసేన పార్టీ్ల (Janasena Paty) తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Former Minister Jogi Ramesh) పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన సన్నిహితులు, అనుచరులు కూడా పార్టీ మార్పు నిజమేనని సంకేతాలు ఇస్తున్నారు. కృష్ణా జిల్లా (Krishna District)లో కీలక నేతగా ఉన్న ఆయన టీడీపీ (TDP)లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా, ఆయన జిల్లా వైసీపీ కీలక నేతల సమావేశానికి డుమ్మా కొట్టడంతో పార్టీ మారుతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది.

Advertisement

Next Story

Most Viewed