AP News:వైసీపీకి బిగ్ షాక్..ఆ పార్టీలో చేరిన కీలక నేత

by Disha Web Desk 18 |
AP News:వైసీపీకి బిగ్ షాక్..ఆ పార్టీలో చేరిన కీలక నేత
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ వల్ల అసంతృప్తి చెందిన వైసీపీ నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బాపట్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చీరాల గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం నెల్లూరు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు గోవర్దన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.



Next Story

Most Viewed