- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూమా అఖిలప్రియకు అస్వస్థత.. కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలింపు
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి, టీడీపీ నేత భూమా అఖిప్రియ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారు జామును ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో అఖిలప్రియకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇకపోతే యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్ నంద్యాల నియోజకవర్గంలో అడుగు పెట్టిన సందర్భంలో ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ వర్గీలయు లమధ్య దాడి జరిగింది. ఈ దాడి భూమా అఖిలప్రియ సమక్షంలోనే జరిగింది. అయితే ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో భూమా అఖిలప్రియ ఆమె భర్త ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. కర్నూలు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.
దీంతో పోలీసులు ఆమెను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇకపోతే ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసులు ఐపీసీ 307 , 120 B, 324, రెడ్ విత్ 34 సెక్షన్ క్రింద భూమా అఖిలప్రియతో పాటూ ఆమె భర్త భార్గవ్ రామ్.. అలాగే మరో తొమ్మిది మంది పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ 1 గా భూమా అఖిల ప్రియ, ఏ 4 గా అఖిల ప్రియ అనుచరుడు సాయి, ఏ 7గా అఖిల ప్రియ పీఏ మోహన్, ఏ 11గా భార్గవ రామ్ ఉన్నారు. భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, అఖిల ప్రియ పిఏ మోహన్, అనుచరుడు సాయిను కోర్టులో హాజరుపరిచారు.. కోర్టు రిమాండ్ విధించడంతో కర్నూలు సబ్ జైలుకు తరలించారు.
మరో ఏడు మంది పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ వర్గీయుల మధ్య చోటు చేసుకున్న ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై నిజానిజాలు తెలిసేందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు... ముగ్గురు పార్టీ సీనియర్ నాయకులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే.