ఆర్టీసీ బస్ నడిపిన బాలకృష్ణ

by M.Rajitha |
ఆర్టీసీ బస్ నడిపిన బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్ : కొద్దిసేపు ఆర్టీసీ బస్ డ్రైవర్ అవతారం ఎత్తారు ఎంఎల్ఏ బాలకృష్ణ. శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎంఎల్ఏ బాలకృష్ణ ప్రారంభించారు. బస్సులకు పచ్చజెండా ఊపిన అనంతరం తాను కూడా స్టీరింగ్ పట్టి ఓ బస్సు నడిపారు బాలయ్య. కొద్దిదూరం బస్ నడుపుతూ వెళ్లడంతో రోడ్డుపై ఉన్న జనం బాలకృష్ణను చూడటానికి ఎగబడ్డారు. బాలకృష్ణను ఇలా కొత్త పాత్రలో చూడటం ఇటు అధికారుల్లో, అటు టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపింది. కాగా తమ ప్రాంతానికి కొత్త బస్సులు రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా బాలకృష్ణ బస్ నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

Next Story

Most Viewed