- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్.. ప్రతి రోజూ నడిచే రైళ్లు రద్దు
దిశ,వెబ్ డెస్క్: తిరుమల వెళ్లే రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఆదిలాబాద్- తిరుపతి మధ్య కాజీపేట మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 10, 11 తేదీలలో రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ రూట్‌లో జరిగే ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ చేసుకున్న వారికి తిరిగి డబ్బులు చెల్లిస్తామని వివరించారు. గడిచిన రెండు వారాల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడం ఇది రెండోసారి. ఈ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను పేదవాళ్ల రైలుగా పిలిచుకుంటుంటారు. ఈ కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
మరోవైపు కాజీపేట- డోర్నకల్ మధ్య నడిచే డోర్నకల్ ప్యాసింజరు, సికింద్రాబాద్- వరంగల్ మధ్య నడిచే పుష్‌పుల్, కాజీపేట -బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు చేసారు. ప్రయాణికులు ఈ రైళ్ల రద్దును దృష్టిలో పెట్టుకుని వారి జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వేశాఖ అధికారులు సూచించారు.