ఆటో పల్టీ.. 10 మందికి కూలీలకు గాయాలు

by Anil Sikha |
ఆటో పల్టీ.. 10 మందికి కూలీలకు గాయాలు
X

దిశ, కాకినాడ ప్రతినిధి : ఆటో పల్టీ కొట్టడంతో 10 మంది కూలీలు గాయపడిన ఘటన తుని నియోజకవర్గం తొండంగా మండలం పైడికొండ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. దాదాపు 15 మంది కూలీలు అవంతి రొయ్యల ఫ్యాక్టరీలో పనుల కోసం ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో పది మంది మహిళా కూలీలకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కూలీలంతా పాయకరావుపేట మండలం పెదరామభద్రపురం గ్రామానికి చెందిన వారు

Next Story

Most Viewed