అత్యంత కీలకంగా AP Assembly Budget Sessions.. 14 నుంచే షురూ

by srinivas |
అత్యంత కీలకంగా AP Assembly Budget Sessions.. 14 నుంచే షురూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం కుదిరింది. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలోఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 14 నుంచి నిర్వహించాలని గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 14న ఉదయం 10 గంటల నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఇకపోతే అసెంబ్లీ సమావేశాలు 10 రోజులపాటు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మార్చి 14న మధ్యాహ్నాం కేబినెట్ భేటీ

మార్చి 14న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంఅవుతాయి. అనంతరం మధ్యాహ్నాం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో విశాఖ నుంచి పాలనను ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనేదానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అసెంబ్లీ సాక్షిగా విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన ఇండస్ట్రియల్ పాలసీపైనా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023కి సంబంధించి పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా రాయితీల విషయంలో పలు సవరణలకు ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే విద్యార్థులకు యూనిఫామ్ మార్పు వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తంది. దీంతో పాటు మరికొన్ని కీలక బిల్లులను కూడా కేబినెట్ ఆమోదించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed