పోస్టులు 142.. వచ్చింది 5320 దరఖాస్తులు

by srinivas |   ( Updated:2025-01-24 06:57:31.0  )
పోస్టులు 142.. వచ్చింది 5320 దరఖాస్తులు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నిరుద్యోగం(Un Employment) రోజు రోజుకు బాగా పెరిగిపోతోంది. ఉద్యోగాలు(Jobs) లేక ఎక్కడ నోటిఫికేషన్(NotifiCation) కనిపించినా భారీగా పోటీ పడుతున్నారు. అర్హత ఎక్కువగా ఉన్నా తక్కువ స్థాయి ఉద్యోగాలకు కూడా దరఖాస్తులు చేస్తున్నారు. ఏదైతేనేం ఉద్యోగం వస్తే చాలు అని అనుకుంటున్నారు. అప్లై చేస్తున్నారు. దీంతో కాంపిటేషన్ మరింత పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం మచిలీపట్నం మెడికల్ కళాశాల(Machilipatnam Medical College) పరిధిలో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 27 కేటగిరిలకు చెందిన 142 పోస్టులకు అప్లై చేసుకోవాలని పిలుపు నిచ్చారు. 23వ (గురువారం)తేదీ వరకూ గడువు ఇచ్చారు.

దీంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తులు చేశారు. మొత్తం 5320 మంది అభ్యర్థులు ఉద్యోగం కోసం అప్లికేషన్లు పంపారు. ఈ దరఖాస్తులను పరిశీలించి స్క్రూటినీ చేస్తామని కాలేజీ అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 15న ప్రొవినల్ లిస్టు విడుదల చేస్తామన్నారు. 16,17 తేదీల్లో జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 24 తర్వాత మరో ప్రొవిజనల్ జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆధర్యంలో పరిశీలించి ఫిబ్రవరి 28న తేదీన తుది లిస్టును ప్రకటిస్తామని డీ.టీ.కె.రెడ్డి పేర్కొన్నారు. కుల నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ ఉంటుందని తెలిపారు.



Next Story