- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సంక్షేమంతోపాటు అభివృద్ధిలోనూ ఏపీ టాప్: వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : సంక్షేమంతోపాటు అభివృద్ధిలోనూ ఏపీ టాప్ అని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారికి సంక్షేమం అందిందని చెప్పుకొచ్చారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో తెలియజేస్తున్నట్లు తెలిపారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో శుక్రవారం సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్సర్స్‌తో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. 2019 మాదిరిగానే 2024లోనూ వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని విజయసాయిరెడ్డి కోరారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఫిషింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని వెల్లడించారు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఒకటి, అర లోపాలు ఉంటే ఉండవచ్చని వాటిని సరిదిద్దుకుంటామని తెలిపారు. అయితే ఎల్లో మీడియా వైసీపీపై దుష్ప్రచారం చేస్తోందని దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఎల్లోమీడియాను ఇన్‌ఫ్లూయెన్సర్లు ధీటుగా ఎదుర్కోవాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సూచించారు.