AP: ఏపీలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల.. మహామహులు ఎన్నికల బరిలోకి!

by Shiva |   ( Updated:2024-04-01 15:19:45.0  )
AP: ఏపీలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల.. మహామహులు ఎన్నికల బరిలోకి!
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించా‌యి. అభ్యర్థులు కూడా ప్రచార కార్యక్రమాలను సైతం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. కడప నుంచి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల బరిలోకి దిగబోతోంది. అదేవిధంగా రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు పోటీలో ఉండబోతున్నారు. బాపట్ల నుంచి జేడీ శీలం, ఇక కాకినాడ నుంచి పళ్లం రాజు, విశాఖ నుంచి సత్యారెడ్డి పోటీ చేస్తున్నారు. అనకాపల్లి నుంచి వేగి వెంకటేశ్‌ ఫైట్‌ చేయనున్నారు. రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహిన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Read More..

పొలిటికల్ ఎంట్రీపై సినీ నటుడు సుమన్ క్లారిటీ.. ఎన్నికల వేళ ఓటర్లకు కీలక పిలుపు

Advertisement

Next Story