AP Govt.: ఉచిత సిలిండర్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం.. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం

by Shiva |
AP Govt.: ఉచిత సిలిండర్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం.. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఉచిత సిలిండర్ పథకానికి (Free Cylinder Scheme) శ్రీకారం చుట్టింది. దీపావళి (Diwali) నుంచే ఫ్రీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇవాళ్టి నుంచే గ్యాస్ బుకింగ్ (Gas Booking Service) సేవలను ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా అక్టోబర్ 31 నుంచి మార్చి వరకు ఒక సిలిండర్, ఏప్రిల్ 1, 2015 నుంచి జూలై వరకు మరొకటి, జూలై 1 నుంచి నవంబర్ వరకు దశల వారీగా మొత్తం మూడో సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నారు.

వినియోదారులు ఇవాళ గ్యాస్ బుకింగ్ చేసుకుంటే సరిగ్గా దీపావళి (Diwali) రోజున డెలివరీ చేయనున్నారు. కాగా, సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీ (Gas Agency)కి వినియోగదారులు ముందుగా రూ.811 చెల్లించాలి. అయితే, కట్టిన డబ్బు రెండు రోజుల్లో మళ్లీ వారి బ్యాంక్ అకౌంట్ల (Bank Accounts)లో జమ కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్టు (White Ration Cards) ఉన్న వారు ఈ ఉచిత సిలిండర్‌ పథకానికి (Free Cylinder Scheme) దరఖాస్తు చేసుకొవచ్చు. బుకింగ్‌లో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా.. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ (Toll Free Number) 1967కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.

Advertisement
Next Story

Most Viewed