Chandrababu: రాజకీయాల్లో మందా జగన్నాథం తనదైన ముద్ర

by Gantepaka Srikanth |
Chandrababu: రాజకీయాల్లో మందా జగన్నాథం తనదైన ముద్ర
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌ కర్నూల్‌(Nagar Kurnool) మాజీ ఎంపీ మందా జగన్నాథం(Manda Jagannadham) మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికైన జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని కొనియాడారు. పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివిన ఆయన.. టీడీపీ ఎంపీగా గెలిచి ప్రజా సేవ చేశారని గుర్తుచేశారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా, జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో 1951 మే 22న జగన్నాథం జన్మించారు. రాజకీయాల్లో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదిగారు. నాగర్‌కర్నూల్‌(ఎస్సీ రిజర్వుడ్‌) లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. 1996, 1999, 2004లలో టీడీసీ తరపున వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. 1998లో ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2009లో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచి మరోసారి ఎంపీగా గెలుపొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement
Next Story

Most Viewed