Delhi: సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవంలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం

by srinivas |   ( Updated:2025-02-20 07:18:36.0  )
Delhi: సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవంలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా(Delhi Chief Minister Rekha Gupta) ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ(Pm Modi)తో పాటు కేంద్రమంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy cm Pawan Kalyan), కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ప్రధాని మోడీ అప్యాయంగా పలకరించారు. పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ మోడీ నవ్వులు కురిపించారు. దీంతో పక్కనున్న నేతలు కూడా సరదాగా నవ్వుకున్నారు.

కాగా ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ- 48, ఆప్-22 సీట్లు దక్కాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగిరింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి కూటమి ప్రభుత్వం భాగస్వామ్యులకు సైతం ఆహ్వానం పంపారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed