- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ నెల 7న ఏపీ కేబినెట్ భేటీ.. ఆ పథకాలపై ఫోకస్!

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన ఈ నెల 7వ తేదీన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) జరగనుంది. రాష్ట్ర సచివాలయంలోని మొదటి భవనంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు(Budget Meetings) కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశంలో కీలక పథకాలు(Schemes), ప్రాజెక్టు(Projects)లు అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీ(Delhi) పర్యటనకు వెళ్లనున్నారు. 5వ తేదీన ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం అదే రోజు రాత్రి తిరిగి విశాఖపట్నం(Visakhapatnam) చేరుకుంటారు. 6వ తేదీన మళ్లీ ఢిల్లీ పయనం కానున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఓ ఆంగ్ల ఛానల్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు.