- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP: ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల ఎంట్రీపై బహ్మానందం, కేవీపీ చిట్‌చాట్.. పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న కామెంట్స్ (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏపీ కాంగ్రెస్‌లో వీలినం చేసిన వైఎస్ షర్మిలకు ఆ పార్టీ అధిష్టానం ఏపీ పీసీసీ పదవిని కట్టబెట్టింది. ఈ మేరకు ఆమె సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. కాస్త లేటుగానైనా.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసే నాయకుల జాబితాను రెండు దఫాల్లో ప్రకటించి ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తూ ముందుకెళ్తున్నారు. అన్న జగన్‌తో విభేదాలు తలెత్తడంతో ఆమె రాజకీయంగా కొన్నాళ్ల నుంచి ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కేవీపీ రామచందర్ రావు సపోర్టుతో ఆమె ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. అధికార వైసీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. సొంత అన్న అని కూడా చూడకుండా సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్ పార్టీకి మైలేజీ తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎల్లప్పుడూ వైఎస్ షర్మిల వెన్నంటి ఉండే కేవీపీ ఆమెపై హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవలే ఓ ఫంక్షన్‌కు ప్రముఖ సినీనటుడు, కమెడియన్ బ్రహ్మానందం, కేవీపీలు హాజయ్యారు.
అయితే, ఏపీలో షర్మిల ఎంట్రీ ఎలా ఉందని బ్రహ్మానందం, కేవీపీని ప్రశ్నించగా.. ఆయన ‘ఏపీలో షర్మిల ఓపెనింగ్స్ బాగున్నాయ్.. కానీ కలెక్షన్లే చాలా డల్‌గా ఉన్నాయి’ అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ఏపీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేవీపీపై కన్నె్ర్ర చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.